Cine Cynic Header Image

చక్రం: జగమంత కుటుంబం నాది

చిత్రం: కృష్ణ్ణ వంశి గారి చక్రం
రాసినది: “సిరివెన్నెల” సీతారామ శాస్త్రి
కూర్చినది: చక్రి
పాడినది: శ్రీనివాస చక్రవర్తి

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె

కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెలదారిలొ మంచు యెడారిలొ
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతోనేను అనుగమిస్తు నాతోనేనే రమిస్తు
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని

మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై
మంటలమాటున వెన్నెల నేనై వెన్నెలపూతల మంటను నేనై
రవినై శసినై దివమై నిశినై
నాతోనెను సహగమిస్తు నాతోనెనే “గమిస్తు”
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని

గాలిపల్లకిలోన తరలి నా పాట పాప వూరెగి వెడలె
గొంతువాకిలిని మూసి మరలితన్నూగబొయి నా గుండె మిగిలె
నా హృదయమే నాలోగిలి నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి నా హృదయంలొ ఇది “సినీమాలి”

chitram: kRshNa vamSi gAri chakram
rAsinadi: “sirivennela” sItArAma SAstri
kUrchinadi: chakri
pADinadi: SrInivAsa chakravarti

jagamanta kuTumbam nAdi EkAki jIvitam nAdi
samsAra sAgaram nAde sanyAsam SUnyam nAve

kavinai kavitanai bhAryanai bhartanai
malleladArilo manchu yeDArilo
pannITi jayagItAla kannITi jalapAtAla
nAtOnEnu anugamistu nAtOnEnE ramistu
vanTarinai anavaratam kanTunnAnu nirantaram
kalalni kathalni mATalni pATalni
rangulni rangavallulni kAvyakanyalni ADapillalni

minTiki kanTini nEnai kanTanu manTanu nEnai
manTalamATuna vennela nEnai vennelapUtala manTanu nEnai
ravinai Sasinai divamai niSinai
nAtOnenu sahagamistu nAtOnenE “gamistu”
vanTarinai pratinimiSham kanTunnAnu nirantaram
kiraNAlni kiraNAla hariNAlni hariNAla
charaNAlni charaNAla chalanAla kanarAni gamyAla kAlAnni indrajAlAnni

gAlipallakilOna tarali nA pATa pApa vUregi veDale
gontuvAkilini mUsi maralitannUgaboyi nA gunDe migile
nA hRdayamE nAlOgili nA hRdayamE nA pATaki talli
nA hRdayamE nAku Ali nA hRdayamlo idi sinIvAli

Amazon Ads:

Leave a Reply

Powered by WP Hashcash