చిత్రం: ఎల్ వి ప్రసాద్ గారి అప్పు చెసి పప్పు కూడు
రాసినది: పింగళి నాగేశ్వరరావు
కూర్చినది: ఎస్ రాజెశ్వరరావు
పాడినది: ఘంటసాల
కప్పనుబట్టిన పామును గప్పునబట్టంగ గద్ద కనిపెట్టుండెన్
గొప్పలుగొట్టేవారల పప్పుడకదు సాములొద్ద భజ గోవిందా
కాకులు పెట్టిన గూళ్ళను కోకిలములు గుడ్లు పెట్ట కొళ్ళై భువిలో
మెకలనే తినసాగెను పాకారికి తిప్పలొచ్చె భజ గోవిందా
నీలోపలి నాలోపలి లోలోపలి గుట్టు తెలియ లోకమె తెలియున్
పాలను నీరము కలిపిన పాలేయగు నీరుగాదు భజ గోవిందా
chitram: el vi prasAd gAri appu chesi pappu kUDu
rAsinadi: pingaLi nAgESwararAvu
kUrchinadi: es rAjeSwararAvu
pADinadi: ghanTasAla
kappanubaTTina pAmunu gappunabaTTanga gadda kanipeTTunDen
goppalugoTTEvArala pappuDakadu sAmulodda bhaja gOvindA
kAkulu peTTina gULLanu kOkilamulu guDlu peTTa koLLai bhuvilO
mekalanE tinasAgenu pAkAriki tippalocche bhaja gOvindA
nIlOpali nAlOpali lOlOpali guTTu teliya lOkame teliyun
pAlanu nIramu kalipina pAlEyagu nIrugAdu bhaja gOvindA