చిత్రం: వి మధుసూదన్ రావు గారి గుడిగంటలు (1965)
రాసినది: ఆచార్య ఆత్రేయ?
కూర్చినది: ఘంటసాల
పాడినది: ఘంటసాల
జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
మంచి గెలిచి మానవుడుగ మారినానురా
స్వార్ధమను పిశాచి మదిని స్వారిచేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
దైవశక్తి మృగత్వమునె సంహరించెరా
సమరభూమి నా హృదయం శాంతిపొందెరా
క్రోధలోభమోహములే పడగలెత్తెరా
బుసలుగొట్టి గుండెలోన విషముగ్రక్కెరా
ధర్మజ్యోతి తల్లివోలె ఆదరించెరా
నా మనసె దివ్య మందిరముగ మారిపొయెరా
మట్టియెందె మాణిక్యము దాగియుండురా
మనిషియెందె మహాత్ముని కాంచగలవురా
ప్రతిగుండెలొ గుడిగంటలు ప్రతిధ్వనించురా
ఆ దివ్యస్వరం న్యాయపథం చూపగలుగురా
chitram: vi madhusUdan rAvu gAri guDiganTalu (1965)
rAsinadi: AchArya AtrEya?
kUrchinadi: ghanTasAla
pADinadi: ghanTasAla
janmamettitirA anubhavinchitirA
bratuku samaramulO panDipOyitirA
manchi gelichi mAnavuDuga mArinAnurA
svArdhamanu piSAchi madini svArichEserA
bratukantA chelarEgina praLayamAyerA
daivaSakti mRgatvamune saMharincherA
samarabhUmi nA hRdayam SAntiponderA
krOdhalObhamOhamulE paDagaletterA
busalugoTTi gunDelOna viShamugrakkerA
dharmajyOti tallivOle AdarincherA
nA manase divya mandiramuga mAripoyerA
maTTiyende mANikyamu dAgiyunDurA
maniShiyende mahAtmuni kAnchagalavurA
pratigunDelo guDiganTalu pratidhvaninturA
A divyasvaram nyAyapatham chUpagalugurA