చిత్రం: ఆదుర్తి సుబ్బారావు గారి తొడి కోడళ్ళు (1957)
రాసినది: శ్రీరంగం శ్రీనివాసరావు
కూర్చినది: మాస్టర్ వేణు
పాడినది: ఘంటసాల
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా
నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపొతే
వారి బుగ్గల నిగ్గునీకు వచ్చిచేరెను తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
నిలిచివిను నీ బడాయిచాలు తెలుసుకో ఈ నిజానిజాలు
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపుకాలే కష్టజీవులు వడలువిరిచి గనులుసొలిచి
చెమట సలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
నిలిచివిను నీ బడాయిచాలు తెలుసుకో ఈ నిజానిజాలు
గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగుపాతల బరువుబ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
నిలిచివిను నీ బడాయిచాలు తెలుసుకో ఈ నిజానిజాలు
chitram: Adurti subbArAvu gAri toDi kODaLLu (1957)
rAsinadi: SrIrangam SrInivAsarAvu
kUrchinadi: mAsTar vENu
pADinadi: ghanTasAla
kArulO ShikArukeLLE pAlabuggala pasiDidAnA
buggamIda gulAbirangu elAvacchenO cheppagalavA
ninnuminchina kannelendarO manDuTenDalO mADipotE
vAri buggala niggunIku vacchichErenu telusukO
kArulO ShikArukeLLE pAlabuggala pasiDidAnA
nilichivinu nI baDAyichAlu telusukO I nijAnijAlu
chaluvarAti mEDalOna kulukutAvE kurradAnA
mEDagaTTina chaluvarAyi elA vacchenO cheppagalavA
kaDupukAlE kaShTajIvulu vaDaluvirichi ganulusolichi
chemaTa saluvanu chErchi rALLanu tIrchinAru telusukO
kArulO ShikArukeLLE pAlabuggala pasiDidAnA
nilichivinu nI baDAyichAlu telusukO I nijAnijAlu
gAlilOna tElipOyE chIragaTTina chinnadAnA
jiluguvelugula chIra Silpam elA vacchenO cheppagalavA
chirugupAtala baruvubratukula nEtagALLE nEsinAru
chAkirokaridi soukhyamokaridi sAgadinka telusukO
kArulO ShikArukeLLE pAlabuggala pasiDidAnA
nilichivinu nI baDAyichAlu telusukO I nijAnijAlu