చిత్రం: పి పుల్లయ్య గారి కన్యాశుల్కం (1955)
రాసినది: గురజాడ అప్పారావు
కూర్చినది: ఘంటసాల
పాడినది: ఘంటసాల
పుత్తడి బొమ్మా! పూర్ణమ్మా!
మేలిమి బంగరు మెలతల్లారా
కలవల కన్నుల కన్నెల్లారా
తల్లులగన్న పిల్లల్లారా
విన్నారమ్మా ఈ కథనూ?
విన్నారమ్మా ఈ కథనూ?
కొండలనడుమన కోనొకటుంది
కోనకి నడుమ కొలనొకటుంది
కొలనిగట్టున కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ
పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
అన్నల తమ్ముల కనుగై
దుర్గకు పూజకు పూవులు కొసేది
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
అందాలకి చందమామలా
గుణాలకి రత్నాలరాశిలా
నలుగురి కన్నుల్లో కనుపాపై
నట్టింట దేపమై వెలుగుతున్న పూర్ణమ్మను
అయ్యో! అప్పుడెంచేశారయ్యా అంటే!
కాసుకులొనై తల్లితండ్రి
వెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను
ఒక ముదుసలి మొగుడుకి ముడివేసి
ముద్దు నగవులు మురిపెంబు మరి
పెనిమిటిగాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖకమలమ్ములో
కన్నులగ్రమ్మెను కన్నీరు
ఆటలపాటల తొటి కన్నియలు
మొగుడు తాతయని గేలించ
ఆటలపాటల కలియక పూర్ణమ్మ
దుర్గనుచేరి దు:ఖ్ఖించే
తల్లిదండ్రులుగట్టిన ఉరితాడు
విప్పడానికి వశమా! తప్పడానికి వశమా!
గొల్లు గొల్లున ఏద్చింది
గుండె రాయినిజెసుకొని ఓర్చింది
పుత్తడిబొమ్మ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
కొన్నాళ్ళకు పతి కొనిపోవొచ్చెను
పుత్తడిబొమ్మను పూర్ణమ్మను
చేరలు సొమ్ములు చాలకదెచ్చెను
పుత్తడిబొమ్మకు పూర్ణమ్మకు
అయ్యొ! అప్పుడెంచేసిందయ్యా అంటె!
పెద్దలకప్పుడు మ్రొక్కెను పూర్ణమ్మ
తల్లిదండ్రి దీవింత్రి
నీ కడుపు చల్లగా
పదిమంది బిడ్డలకు తల్లివై
పసుపు బొట్టు పెట్టుకు
పదికాలాలపాటు వర్ధిల్లమ్మా అంటే
దీవెన వింటూ పక్కున నవ్వెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
పిన్నలందరి కౌగిటపెట్టుకు
కంటనుబెట్టెను కన్నీరు
అన్నలతమ్ములనప్పుడు పలికెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
అన్నల్లారా! తమ్ముల్లారా!
అమ్మను అయ్యను కానండి
బంగరు దుర్గను భక్తితొ
కొలవండమ్మలకమ్మ దుర్గమ్మ
నలుగురు కూర్చుని నవ్వేవేళల
నాపేరొకసరి తలవండి
మీమీ కన్నబిడ్డలనొకతెకు
ప్రేమను నాపేరివ్వండి
అన్నల్లారా! తమ్ముల్లారా!
వలవల కన్నుల కన్నీరొలికెను
పుత్తడిబొమ్మకు పూర్ణమ్మకు
కన్నులుతుడుచుకు కలకల నవ్వెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
వగచిరి వదినెలు వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టెన్
కాసుకులోనై అల్లుని తలచుకు
ఆనందించెను అయ్యొకడే!
ఎప్పటిఎట్టుల సాయంత్రమ్మున
ఏరిన పూవ్వులు సరికూర్చి
సంతోషమ్మున దుర్గను కొలువను
ఒంటిగబోయెను పూర్ణమ్మ
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
ఆవులు మదవులు మందలుజేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
వింటను చుక్కలు మెరయుచు పొడిమెను
పూర్ణమ్మ ఇంటికిరాదాయె
కన్నులకాంతులు కలవలచేరెను
మేలిమిజేరెను మేనిపసల్
హంసలజేరెను నడకల బెడగులు
దుర్గనుజేరెను పూర్ణమ్మ
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
chitram: pi pullayya gAri kanyASulkaM (1955)
rAsinadi: gurajADa appArAvu
kUrchinadi: ghanTasAla
pADinadi: ghanTasAla
puttaDi bommA! pUrNammA!
mElimi bangaru melatallArA
kalavala kannula kannellArA
tallulaganna pillallArA
vinnArammA I kathanU?
vinnArammA I kathanU?
konDalanaDumana kOnokaTundi
kOnaki naDuma kolanokaTundi
kolanigaTTuna kOvela lOpala
velasenu bangaru durgamma
pUjArinTanu puTTenu chinnadi
puttaDibomma pUrNamma
annala tammula kanugai
durgaku pUjaku pUvulu kosEdi
puttaDibomma pUrNamma
puttaDibomma pUrNamma
EyE vELala pUsE puvvula
AyA vELala andinchi
bangaru durganu bhaktito kolichenu
puttaDibomma pUrNamma
puttaDibomma pUrNamma
andAlaki chandamAmalA
guNAlaki ratnAlarASilA
naluguri kannullO kanupApai
naTTinTa dEpamai velugutunna pUrNammanu
ayyO! appuDemchESArayyA anTE!
kAsukulonai tallitanDri
venarU nyAyam viDanADi
puttaDi bommanu pUrNammanu
oka mudusali moguDuki muDivEsi
muddu nagavulu muripembu mari
penimiTigAnchina nimiShamuna
bAsenu kanniya mukhakamalammulO
kannulagrammenu kannIru
ATalapATala toTi kanniyalu
moguDu tAtayani gElincha
ATalapATala kaliyaka pUrNamma
durganuchEri du:khkhinchE
tallidanDrulugaTTina uritADu
vippaDAniki vaSamA! tappaDAniki vaSamA!
gollu golluna Edchindi
gunDe rAyinijesukoni Orchindi
puttaDibomma puttaDibomma pUrNamma
konnALLaku pati konipOvocchenu
puttaDibommanu pUrNammanu
chEralu sommulu chAlakadecchenu
puttaDibommaku pUrNammaku
ayyO! appuDemchEsindayyA anTe!
peddalakappuDu mrokkenu pUrNamma
tallidanDri dIvintri
nI kaDupu challagA
padimandi biDDalaku tallivai
pasupu boTTu peTTuku
padikAlAlapATu vardhillammA anTE
dIvena vinTU pakkuna navvenu
puttaDibomma pUrNamma
pinnalandari kougiTapeTTuku
kanTanubeTTenu kannIru
annalatammulanappuDu palikenu
puttaDibomma pUrNamma
annallArA! tammullArA!
ammanu ayyanu kAnanDi
bangaru durganu bhaktito
kolavanDammalakamma durgamma
naluguru kUrchuni navvEvELala
nApErokasari talavanDi
mImI kannabiDDalanokateku
prEmanu nApErivvanDi
annallArA! tammullArA!
valavala kannula kannIrolikenu
puttaDibommaku pUrNammaku
kannulutuDuchuku kalakala navvenu
puttaDibomma pUrNamma
vagachiri vadinelu vagachiri tammulu
talliyu kanTanu taDibeTTen
kAsukulOnai alluni talachuku
Anandinchenu ayyokaDE!
eppaTieTTula sAyantrammuna
Erina pUvvulu sarikUrchi
santOshammuna durganu koluvanu
onTigabOyenu pUrNamma
puttaDibomma pUrNamma
Avulu madavulu mandalujErenu
piTTalu cheTlanu gumigUDen
vinTanu chukkalu merayuchu poDimenu
pUrNamma inTikirAdAye
kannulakAntulu kalavalachErenu
mElimi jErenu mEnipasal
hamsala jErenu naDakala beDagulu
durganu chErenu pUrNamma
puttaDibomma pUrNamma
venaru nyAyam viDanADi
puttaDi bommanu pUrNammanu
oka mudusali moguDuki muDivEsi